Tirupati Goud: సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల్ని కొనసాగిస్తాం

సిరా న్యూస్, చిగురుమామిడి
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల్ని కొనసాగిస్తాం
* గౌడ సంఘం నాయకులు
* గౌడ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి

అట్టడుగు వర్గాల రాజ్యాన్ని స్థాపించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు అన్నారు. మంగ‌ళ‌వారం చిగురుమామిడి మండల గౌడ సంఘం అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బుర్ర తిరుపతి గౌడ్, సాయి కార్యదర్శి కొండ కనకయ్య గౌడ్, ముల్కనూరు గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య గౌడ్, పుధరి వేణు గౌడ్, బుడిగే పరశురాములు గౌడ్, గట్టు బుచ్చయ్య గౌడ్, బండారుపల్లి తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాయ మల్లు గౌడ్, అరవింద్ గౌడ్, పరకాల కొండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *