Tirupati Reddy: మహా ప్రస్థాన‌ వాహనం ఏర్పాటు

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
మహా ప్రస్థాన‌ వాహనం ఏర్పాటు

పుట్టిన గడ్డ …పెరిగిన ఊరు కోసం …మనం ఎక్కడున్నా మన పుట్టిన ఊరు కోసం ఏదో చేయాలని తపన..ఈ నేల కోసం ఏదో ఇవ్వాలన్నా ఆలోచన.. ఆ ఆలోచన నుండి పుట్టిందే మహా ప్రస్తాన వాహనం(స్వర్గ రథం). ఒక మంచి ఆలోచనతో ఊరికి ఏదైనా చేయాలని తపనతో గూడెల్లి తిరుపతి రెడ్డి తండ్రి క్రీ.శే. గూడెల్లి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం తో గురువారం శ్రీ తపాలా లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో పూజలు నిర్వహించి మహాప్రస్థాన వాహనం మల్లారం గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మంచి పనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు న ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఊరు అభివృద్ధి కోసం పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *