: నేడు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం

సిరా న్యూస్;

మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్‌, మదర్స్‌ డే, లవర్స్‌ డే మాదిరి బ్రదర్స్‌ డే ను ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరుడు అంటే అన్నాతమ్ముడు ఎవరైనా కావొచ్చు. మనతో ఆత్మీయంగా స్నేహితుడి మాదిరి ఉండే వ్యక్తి సోదరుడు. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్‌ చెప్పొచ్చు. అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 24న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో అంతర్జాతీయ బ్రదర్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ బ్రదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు. అసలు ఎప్పుడూ ప్రారంభమైందో తెలుసుకుందామా… 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. అలబామాకు చెందిన సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత సి డేనియల్ రోడ్స్ మొదటగా ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న జరుపుకునే నేషనల్ సిబ్లింగ్స్ డే దినోత్సవం మాదిరిగానే ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. అయితే మొదట్లో దీనిని కేవలం అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈరోజును జరుపుకోవడం ప్రారంభించాయి. కొన్ని దేశాలలో ఈరోజున అధికారిక సెలవు దినంగా పాటిస్తారు. ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైనవి వంటకాలు చేసి కలిసి భుజిస్తారు. అన్నాదమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే బ్రదర్స్ డే.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *