సిరా న్యూస్;
రజినీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.
ఓషో బోధన : జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎఱుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్లైటెన్మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు – మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని అతను అన్నాడు.
హిందీ, ఆంగ్లభాషలలో అతను అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు, సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, యోగ సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో అతను ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ “ఆలోచనా పద్ధతి”లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని అతను ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు అతను్ని “సెక్స్ గురువు” అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని సెక్స్ టు సూపర్ కౌన్సియస్ అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు, ఈ పుస్తకం సంబోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది. అతను చెప్పినది, “తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే” సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని.
“ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి.జీవితం పక్షి.ప్రేమ,స్వేచ్చ రెండు రెక్కలు. అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం.అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం”