నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం

సిరా న్యూస్;
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ప్రపచవ్యాప్తంగా 70 దేశాల్లో 5 వేల తెగలకు చెందిన 38 కోట్ల మంది ఆదివాసీ గిరిజన తెగలు మనుగడ సాగిస్తున్నాయి. నిరక్ష్య రాస్యత, పోషకాహార లోపం తో ఇబ్బంది పడుతున్నారు. ఆదివాసీ లను అభివృద్ధి చేసేందుకు 1982 ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం గా ప్రకటించారు. ఐటీడీఏ లు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి వారి అభివృద్ధి కి కృషి చేయాలి.
1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *