సిరా న్యూస్;
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 07న జరుపుకుంటారు. మొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. “ది ఫుచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి” అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది కూడా ఈ దినోత్సవాన్ని సరకొత్త థీమ్‌తో ఘనంగా నిర్వహించనున్నారు.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ దినోత్సవాన్ని నిర్వహి స్తుంది..“ఆహార భద్రత ప్రతి ఒక్కరి వ్యాపారం” అనే థీమ్‌గా తీసుకుని ప్రచార కార్యక్రమాలు చేపట్టడమే కాక ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం దాని కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. ప్రైవేట్ రంగం, పౌర సమాజం, యూఎన్ సంస్థలు, ప్రజలు దీని కోసం పలు చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తోంది.ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు మధ్య భాగస్వామ్య బాధ్యత. అంతేకాదు మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదేనా అని నిర్థారించడంలో రైతు నుంచి కూలి వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆహార భద్రత కోసం తగు చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం, ఆహార కొరత సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం, ప్రజలు రకరకాల వ్యాధులను ఎదుర్కోనేలా వారికి పౌష్టికరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేయడం వంటివి తమ ప్రధాన ఎజెండాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
[11:49 AM, 6/6/2024] +91 90009 67435: సబ్బితం గ్రామవాసికి ఫార్మసీ లో డాక్టరేట్
ప్రజాక్రాంతి,పెద్దపల్లి ప్రతినిధి: మండలం లోని సబ్బితం గ్రామానికి చెందిన పులిపాక శంకరయ్యకు ఫార్మసీ లో డాక్టరేట్ లభించింది. పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆశిష్ సుత్తీ, డాక్టర్ ఎం.రవికుమార్ పర్యవేక్షణలో అయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథం “డెవలప్మెంట్, ఆప్టిమైజేషన్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ నానో ఫార్ములేషన్స్ ఆఫ్ ఆల్పీనియా మ్యూటికా అండ్ ట్రేడ్స్కాంటియా స్పాథేసియా యాంటీ-డయాబెటిక్ యాక్టివిటీ” లో డాక్టరేట్ లభించింది. పులిపాక నర్సయ్య పులిపాక మధునమ్మ దంపతుల కుమారుడైన శంకరయ్య ఏడవ తరగతి వరకు కమాన్ పూర్ మండలం పేర పల్లి గ్రామములో చదువు కున్నాడు. పదవ తరగతి వరకు పెద్దపల్లిలోని ఇండియన్ మిషన్ సెకండరీ స్కూల్ లో, ఇంటర్ పెద్దపల్లి ప్రభుత్వ కాలేజీలో, బి.ఫార్మసీ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీలో చదువు కున్నాడు.