నేడు ప్రపంచ సింహాల దినోత్సవం

సిరా న్యూస్;
సింహం ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. వీటి పొడవు 5 – 8 అడుగులు, బరువు 150 – 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది. మంచిగా పెరిగిన మగసింహం బరువు 150 నుండి 259 కేజీల దాకా ఉంటుంది. సింహం యొక్క గర్జన 8 కి.మీ. దాకా వినబడుతుందట. సింహం తోక కి ఉన్న కుచ్చుల పైగల భాగంలో ఉన్న నల్ల చారలని బట్టి సింహం వయసుని లెక్కిస్తారు. సింహాలు చక్కగా ఈదగలవు.
పులికి సింహానికి దగ్గరి బంధుత్వం కూడా ఉంది. కాని, పులుల మాదిరిగా సింహాలు ఒంటరిగా ఉండవు. ఒక్కో సమూహంలో 5 నుంచి 16 దాకా కలిసి ఉంటూ జంతువులను వేటాడుతుంటాయి. సింహాలు రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ… వాతావరణం బాగుందనుకున్నప్పుడు ఓ నాలుగు గంటలు… అది కూడా రాత్రులే ఎక్కువగా వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి.
ఆసియా ఖండంలోని సింహాలు ఆఫ్రికా ఖండంలోని వాటితో పోల్చితే తక్కువ బరువు కలిగి ఉంటాయి. సింహాలకు వాటి పైనున్న చర్మాలని తొలగించితే గుర్తు పట్టడం కూడా కష్టమే. అందుకే వేటగాళ్ళు వాటి చర్మం కోసం, సర్కస్‌లలో ఆడించడానికి ఎక్కువగా వేటాడటం వల్ల అంతరించిపోతున్నాయని జంతు ప్రేమికుల అభిప్రాయం. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఎక్కువ సింహాలున్నాయి. భారతదేశంలో గుజరాత్‌ లోని గిర్‌ అభయారణ్యంలోనే ఇప్పుడు సింహాలు కనబడుతుంటాయి. కాని ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *