నేడు ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం

సిరా న్యూస్;

వాతావరణ శాస్త్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రకృతి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్ణయించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయి.
వాతావరణ పరిశోధన చేసిన వాళ్ళకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హో వైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్-మమ్ అంతర్జాతీయ అవార్డు లు బహుమతులు అందజేయబడుతాయి.
ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా దేశాలు తపాలా బిళ్ళలను, ప్రత్యేక తపాలా స్టాంపు గుర్తులను విడుదల చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *