– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పలువురు ప్రజా ప్రతినిధులు పర్యటించి నియోజకవర్గంలో పలు మండలాలతోపాటు పెద్దపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి శనివారం రానున్నారని ఎమ్మెల్యే చింత కుంట విజయరామణారావు తెలిపారు. ఆయన సందర్భంగా స్థల ఏర్పాట్లను అధికారులు,ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 132/33 కె.వి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన, పెద్దపల్లి పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన అలాగే పెద్దపల్లి ఎస్టి కాలనీలో భూమి పూజ అనంతరం పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో పలు అభివృద్ధి పనులతో పాటు అమృత్ 2.0 కింద త్రాగు నీటి పధకం టియూఎఫ్ ఐడీసీ కింద పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు శంకుస్థాపనలు చేస్తారన్నారు
అనంతరం పెద్దపల్లి జెండా చౌరస్తా దగ్గర జరిగే పబ్లిక్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు, బస్సు డిపో ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రుల పర్యటనలను నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.