సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బుధవారం ఉదయం చిట్టి నగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చేసేందుకు ట్రాక్టర్ నడుపుతూ ముంపు ప్రాంతాలకు వెళ్లారు. నేరుగా బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు పంపిణీ చేసారు. ప్రతి ఇంటి వద్ద ఆగి ఆహారం అందిందా లేదా అని మంత్రులు అడిగారు. ట్యాంకర్ల ద్వారా నివాసాలకు నీటి సరఫరా చేస్తున్నారు.