సిరా న్యూస్,శేరిలింగంపల్లి;
కేంద్ర బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సిఐటియు, ఎ ఐ టి యు సి, ఏ ఐ యు టి యు సి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చందానగర్ అంబేద్కర్ విగ్రహం నుండి లేబర్ అడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కార్మికులు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలని , కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు బందును పాటిస్తున్నామని అందులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలు రైతు చట్టాలను తీసుకురావడం వీటన్నిటిని కేవలం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని రైతులు చేస్తున్న పోరాటానికి తమ కార్మిక సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు.
====================