లండన్ తర్వాత ముంబైలోనే ట్రాఫిక్

సిరా న్యూస్,ముంబై;
కాలం మారుతున్న కొద్దీ పట్టణాలు, నగరాల జనాభా పెరిగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఇతర అవసరాకలు ఎక్కువ శాతం మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసం ఏర్పరుచుకోవడంతో ఇక్కడి జనాభా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు పై ప్రయాణించాలంటే ట్రాపిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ నగరాల్లో ఉదయం, సాయంత్రం కార్యాలయాకు వెళ్లాలంటే నరకంగా మారుతుంది. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లన్నీ ఖాళీ లేకుండా కనిపిస్తాయి. ఈ నేప్యంలో టామ్ టామ్ అనే సంస్థ ట్రాఫిక్ ఎక్కుగా ఉన్న నగరాలు ఏవో గుర్తించింది. ఈ సంస్థ చెప్పిన ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో తెలుసుకుందాం..ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు అభివృద్ధి దిశలో పయనించినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతంది. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు సిటీలోకి వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసం ఉండడంతో జనాభా పెరిగిపోయి ట్రాఫిక్ పెరిగిపోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితిని గమనించి టామ్ టామ్ అత్యంత ట్రాఫిక్ రద్దీగా ఉండే నగరాలు ఏవో తెలిపింది. ఈ సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరంగా లండన్ గా గుర్తించారు. ఇక్కడ అత్యంత ఎక్కువ సమయంల ట్రాఫిక్ లోనే గడపాల్సి వస్తుంది. ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 37 నిమిషాల 10 సెకండ్స్ సమయం పడుతుంది. అయితే భారత్ లో ఏ నగరాల్లో ఎంత ట్రాఫిక్ ఉందంటే?భారతదేశంలో అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ముంబయ్ ఒకటి. భారతదేశ ఆర్థిక నగరంగా పిలవబడే ముంబయ్ కు రాకపోకలు సాగించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడుతుంది. ముంబయ్ లో 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 21 మినిట్స్ 20 సెకెండ్స్ సమయం పడుతుంది. దీంతో అత్యంత ట్రాఫిక్ రద్దీగా ఉండే నగరాల్లో లండన్ 4వ స్థానంలో నిలిచింది.దేశంలో ముంబయ్ తరువాత అత్యంత ఎక్కువగా ట్రాఫిక్ ఉండే నగరం న్యూ ఢిల్లీగా పేరు తెచ్చుకుంది. దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలలో కార్యాలయాలకు సంబంధించిన పనులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఉదయం ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో న్యూఢిల్లీలో 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 21 నిమిషాల 40 సెకండ్స్ పడుతుంది. దీంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మహారాష్ట్రంలోని పూణె ఉంది. పారిశ్రామిక నగరంగా గుర్తింపు ఉన్న ఇక్కడ రోజురోజుకు జనాభా పెరిగిపోతుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ కూడా విపరీతంగా మారుతంది. దీంతో పూణె నగరంలో ప్రయాణం చేయడం కష్టతంగా మారుతుంది. ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 27 నిమిషాల 50 సెకండ్స్ సమయం పడుతుంది.ఇక అత్యంత ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న నగరంగా బెంగుళూరు నిలిచింది. ఇది దేశంలో నెంబర్ వన్ స్థానంలో.. ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచించి. కార్పొరేట్ నగరంగా పేరున్న బెంగుళూరులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 28 నిమిషాల 10 సెకండ్స్ సమయం పడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *