అమలాపురం నుండి కాకినాడ వెళ్ళే వాహనాలకు దారి మళ్లింపు
సిరా న్యూస్,కోనసీమ;
ఎన్నికల కౌంటింగ్ సెంటర్ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ నేషనల్ హైవే( 216) ఆనుకుని ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాకినాడ నుండి అమలాపురం వైపు వెళ్ళు మోటార్ సైకిళ్ళు, ఆటోలు మరియు కార్లు కొండాలమ్మ చింత టైపాస్ వయా ముక్తేశ్వరం మీదుగా అమలాపురం దారి మళ్లించారు. అమలాపురం నుండి కాకినాడ వెళ్లే వాహనాలు అనాతవరం, మాగం, కాపచింతలపూడి మీదుగా బైపాస్ కొండాలమ్మ చింత మీదుగా అనాతవరం, చెయ్యేరు వాహనదారులు మహిపాల చెరువు, పోతుకుర్రు, కాప కొండాలమ్మ చింత టైపాస్ మీదుగా కాకినాడ మళ్లించారు. కాకినాడ నుండి అమలాపురం.. అమలాపురం నుండి కాకినాడ వెళ్ళే భారీ వాహనములు రేపు ఉదయం నుండి సాయంత్రం కౌంటింగ్ అయ్యేవరకు నిలిపివేస్తారు. కాకినాడ నుండి వచ్చే భారీ వాహనాలు అన్నంపల్లి టోల్ గేట్ వద్ద, అమలాపురం నుండి కాకినాడ వెళ్లే భారీ వాహనములు భట్నవిల్లి Y జంక్షన్ వద్ద ఉదయం 04.30గంటల నుండి కౌంటింగ్ అయ్యేవరకు నిలిపివేస్తారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. అస్సాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసలు పర్యవేక్షిస్తున్నారు.