సిరా న్యూస్, తలమడుగు:
దళారులను నమ్మి మోసపోవద్దు…
-ట్రైని కలెక్టర్ వికాస్ మహాతో
రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని ట్రైని కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల, తలమడుగు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలోని రైతులతో మాట్లాడారు. రైతులంత పత్తి పంటను జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లోనే విక్రాయించాలని, ఇతర ప్రాంతాల నుండి పత్తి పంట కొనుగోలు చేయడానికి వచ్చే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. మండల పరిస్థితులను గురించి తహసీల్దార్ రాజ్ మోహన్ ను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ కలెక్టర్ వెంట తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, మార్కెటింగ్ ఏడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, నాయకులు వెంకన్న యాదవ్, కిసాన్ మిత్ర కోర్డినేటర్ మేకల రమాకాంత్, తదితరులు ఉన్నారు.