సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర క్యాడర్ కు కేటాయించబడిన ఐయేఎప్ ప్రొబేషనర్స్ బుధవారం సాయంత్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించారు. పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో వారు రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామి రెడ్డి తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ బోధన, పరిశోధనా, విస్తరణ విభాగాలలో చేస్తోన్న కార్యక్రమాలు, నిర్వహిస్తోన్న కోర్సులు తదితర అంశాల గురించి రిజిస్ట్రార్ వారికి వివరించారు. తెలంగాణ, వ్యవసాయం కు సంబంధించి పలు వివరాలు వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.