ప్రభుత్వ పాఠశాలల్లో అరుదైన దృశ్యాలు
సిరా న్యూస్,మెదక్;
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీతో విద్యార్థులు కన్నీటి పర్యంతమైయారు.
సిద్దిపేటలోని కాల్లకుంట కాలనీ యూసిఎస్ టీచర్ జయశ్రీ బదిలీపై వెళ్లారు. తమను వదిలి వెళ్లొదంటూ టీచర్ పట్టుకొని విద్యార్థులు వేడుకున్నారు. అలాగే, చేర్యాల (మం)ఆకునూరు పాఠశాలలో ఏడుగురు టీచర్లు బదిలీపై వెళ్లారు. టీచర్లను చుట్టుముట్టి వెళ్ళొదంటూ విద్యార్థులు ఏడ్చారు. విద్యార్థులను సముదాయించేందుకు వచ్చి టీచర్ల భావోద్వేగానికి లోనైయారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలోనూ సేమ్ సీన్ వుంది