సిరా న్యూస్, గుడిహత్నూర్:
గుడిహత్నూర్‌లో అంబేడ్కర్‌కు ఘన నివాళి…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ 67వ వర్ధంతిని అంబేడ్కర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు మాధవ్ మస్కే, ప్రముఖ్య న్యాయవాది జొందలే అజయ్ కుమార్‌ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం కోసం అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ లేని భారతదేశాన్ని ఊహించలేమని, ప్రతీ ఒక్కరు ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సిద్ధార్థ్ ససానే, కాంగ్రేస్ పార్టీ నాయకులు మాధవ్ ససానే, కిషన్ బుద్ధే, కుషాల్ గజ్బారే, దళిత్ గాయ్ కాంబ్లే, అంబేడ్కర్‌వాదులు, వివిద సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.