సిరా న్యూస్,డోన్;
లౌకికతత్వం,ప్రజాసామ్య పరిరక్షణే గాంధీజీకి నిజమైన నివాళులు అర్పించారు,స్థానిక డోన్ పట్టణం లో పాతపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు
మంగళవారం ఉదయం
ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన గాంధీ 76వ వర్థంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ
తాను సనాతన హిందువునని, నిత్యం భగవత్ గీత పారాయణం చేస్తానని, దాన్ననుసరించే జీవితాన్ని మలచుకున్నానని ప్రకటించుకున్న జాతిపితను 1948 జనవరి 30న కాల్సి చంపారు,భారతదేశ, ప్రజల నిర్దిష్ట పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకున్న స్వాతంత్య్ర ఉద్యమ నేతల్లో మహాత్ముడు అగ్రగణ్యుడు,గాంధీ ఆర్థిక, సనాతన భావాల పట్ల విభిన్న దృక్కోణాలు చరిత్రకారుల్లో ఉన్నప్పటికీ భారతీయులందర్నీ ఏకం చేశారు. తొలినాటి జాతీయోద్యమంలో సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా విజ్ఞప్తులు,రాయబారాల ద్వారా రాయితీలు పొందాలని ఉద్యమిస్తుంటే గ్రామీణ, పట్టణ దిగువ తరగతులను కూడా స్వాతంత్య్ర పోరాటంలోకి నడిపిన నాయకుడాయన .భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమిదని గాంధీజీ నమ్మాడు. వివిధ మతాలున్న మన దేశం వైవిధ్యాన్ని పరిరక్షించుకొంటూనే ప్రజలందర్నీ భాగస్వాముల్ని చేయాలన్నాడు,మతం పూర్తిగా వ్యక్తిగతమైనదని రాజకీయాల్లో, ప్రభుత్వ విధానాల్లో దానికి పాత్ర ఉండరాదని ప్రవచించడమే కాదు, ఆచరించాడు,దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్టు 14 రాత్రి గాంధీజీ స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొనలేదు. ఆ రోజు రాత్రి మత కలహాలను ఆపడానికి ప్రయత్నించాడు, అంతకు ముందు దేశ విభజన సందర్భంగా ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న నౌఖాలిలో హిందూ-ముస్లిం మతోన్మాద అగ్నికీలల్ని నివారించడానికి సత్యాగ్రహం చేపట్టాడు.
1948 జనవరి 12న బిర్లా గృహంలో చేసిన చివరి నిరాహార దీక్ష కూడా మత సామరస్యాన్ని కోరుతూ చేపట్టినదే. మత సామరస్యం పట్ల, లౌకికవాదం పట్ల ఆయన అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మత విద్వేషాల్ని రెచ్చగొట్టడం, జాతులు, భాషలు, సంస్కృతుల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టడం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని గాంధీజీ ఉద్భోదించాడు. దేశ స్వాతంత్య్రానికి పునాది హిందూ ముస్లిం ఐక్యతని గాంధీజీ చాటాడు. నేడదే శిరోధార్యం,
గాంధీజీ సామ్రాజ్యవాద వ్యతిరేకి,దక్షిణాఫ్రికాలో ఉండగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించాడు,
స్వాతంత్య్రోద్యమంలో ప్రజలు జాతీయ స్వావలంబన, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కావాలన్నారు,