సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో మందుబాబులకు ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డెలివరీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారానే డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా, బిల్లింగ్ ప్రక్రియ జరుగుతోంది. కానీ సర్వర్లు మొరాయిస్తుండటంతో మద్యం సరఫరాకు నాడు బ్రేకులు పెడ్డాయి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అటు డీలర్లు డిపోల నుంచి మద్యం తెచ్చుకోలేకపోతున్నారు. ఇటు మందుబాబులకు కొన్ని ప్రాంతాల్లో తమకు కావలసిన బ్రాండ్లు దొరకడం లేదు. కొన్ని బ్రాండ్ల మద్యం ఇదివరకే అయిపోనట్లు సమాచారం. కనీసం రాత్రిలోపు అయినా సర్వర్ల సమస్య పరిష్కారం అయితే తెలంగాణలో మద్యం సరఫరా మళ్లీ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మందు బాబులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది. ప్రభుత్వానికి అదనపు ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖ త్వరలో మద్యం ధరలు పెంచడానికి ప్లాన్ సిద్ధం చేస్తోందని ప్రచారం కావడం తెలిసిందే. ఒక్కో బీరుపై దాదాపు రూ.20 వరకు ధర పెంచుతారని, అదే విధంగా లిక్కర్ బాటిల్స్ పై గరిష్టంగా 70 రూపాయల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా సవరించనున్న మద్యం ధరలతో తెలంగాణ ప్రభుత్వానికి అదనపు ఆదాయం నెలకు రూ.1000 కోట్ల వరకు సమకూరేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది.ఇటీవల మద్యం విక్రయాలతో తెలంగాణ దేశంలో అగ్ర స్థానంలో నిలవడం తెలిసిందే. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ వెల్లడించిన సర్వే ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేశారు. ఏపీలో సగటున రూ.1,306, పంజాబ్ లో రూ.1,245, ఛత్తీస్ గఢ్ లో రూ.1,227 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.