సిరాన్యూస్,ఓదెల
శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మల్లిఖార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త డా. సతీష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శివాలయంలో శ్రావణమాసం లో వచ్చిన మొదటి శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో శివునికి అభిషేకాలు చేశారు.అనంతరం అమ్మవారికి ఓడు బియ్యం పోసి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త డా. సతీష్ కుటుంబ సమేతంగా శివాలయం లో దర్శనం చేసుకొని పూజలు చేసి శ్రీ శంభూలింగేశ్వర స్వామి నేమ్ బోర్డును కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి దూపం నాగేంద్రయ్య మాట్లాడుతూ ఈ ఆలయం పూర్వం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిందన్నారు. ఈ ఆలయంలో ని శివుడు విశేషమైన శక్తులుగల మహిమాన్వితమైనదని, ఎలాంటి సత్యమైనకొరికలైన మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ దేవుడు తీర్చుతాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి ఇతర గ్రామాల భక్తులు కూడా వచ్చి పూజలు అభిషేకాలు హోమాలు చేస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు దాతల రూపంలో సహకరించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నoదుకు వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయని అన్నారు. అనంతరం దాతలను డా సతీష్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దూపం నాగేంద్రయ్య అర్చకులు దాతలు శ్రీపతి మహేష్, రామంచ రామకృష్ణ,రామడుగు వెంకటేష్,తాటికొండ రాజ్ కుమార్, రాజయ్య ముద్దసాని,అనిల్,కాసరపు రాజు,శ్రీను,సాగర్,రాజేశం భక్తులు తదితరులు పాల్గొన్నారు.