TSF: ఉచిత కంప్యూటర్ శిక్షణ  దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ఉచిత కంప్యూటర్ శిక్షణ  దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టూడెంట్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఓసియన్ కంప్యూటర్ సౌజన్యంతో వేసవి సెలవులను ఉద్దేశించి విద్యార్థుల భవిష్యత్తు, సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రారంభిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా నలుమూలల నుండి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా టిఎస్ఎఫ్ అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఆసక్తిగల విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఓసియన్ కంప్యూటర్ యాజమాన్యం, సిబ్బంది మహేష్ సింగ్, సాయికుమార్, వేణు, అంకిత, సత్యనారాయణ, టిఎస్ఎఫ్ నాయకులు ఇఫ్తీకార్, సత్యనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *