Tula Arun Kumar: రాహుల్ గాంధీ నిర్మల్ సభను విజయవంతం చేయండి :  తుల అరుణ్ కుమార్

సిరాన్యూస్‌, బోథ్‌
రాహుల్ గాంధీ నిర్మల్ సభను విజయవంతం చేయండి :  తుల అరుణ్ కుమార్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విచార విభాగ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ బోథ్‌ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ లు కోరారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ సొనాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదివారం నిర్మల్ పట్టణంలో జరగబోయే సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త సమావేశాన్ని విజయవంత చేసి పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో సోనాల గ్రామ అధ్యక్షులు చెట్లపల్లి అనిల్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *