సిరాన్యూస్, నాంపల్లి
తుమ్మలపల్లిలో నూతన రేషన్ షాప్ ప్రారంభం
నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో రేషన్ డీలర్ నూతన రేషన్ షాప్‌ను ఏర్పాటు చేశారు. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి నూతన రేషన్ షాపును ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌దారులకు సరుకులు సక్రమంగా అందించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్యలు పాల్గొన్నారు.