ఒంటి పై డీజిల్ చల్లి అంటించెందుకు యత్నం
నిందితులను అరెస్ట్ చేయాలనీ పోలీస్ స్టేషన్ ముట్టడించిన గులాబీ దండు
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
వనపర్తి జిల్లా పానగల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై పానుగల్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు హత్యా యత్నానికి పాల్పడ్డారు.బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పెద్దమ్మ గుడి వద్ద మాట్లాడుకుంటూ వుండగా కొందరి ప్రోత్సాహంతో అటుగా వచ్చిన గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఆది శ్రీను,ఆది స్వామీ ఇద్దరు వచ్చి మాకు దళిత బంధు రాకపోవడానికి నీవే కారణం అంటూ నిన్ను చంపుతాం అని దుర్భాషలడుతూ వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటి పై చల్లి అంటించేందుకు ప్రయత్నించగా అక్కడ వున్న వారు విడిపించగా వాళ్లపై కూడా దాడి చేయడంతో క్రింద పడ్డారు.నిన్ను ఈ రోజు ఎలాగైనా చంపుతాం అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టారు.వెంటనే ఎంపీపీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చెయ్యగా ఇద్దరినీ స్టేషన్ కు పిలిపించి వెంటనే వదిలివెయ్యడంతో సదరు వ్యక్తులు మళ్ళీ వచ్చి ఎంపీపీ తల్లి,తండ్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారు.నీ కొడుకును ఎలాగైనా చంపుతామని,గతంలో రెండు సార్లు తప్పించుకున్నాడు అంటూ తిట్టారు.ఇట్టి సంఘటన బయటకు తెలియడంతో రాత్రి నుండి తెల్లవారే వరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్టేషన్ వద్ద వుండి ఎంపీపీ వెంట ఉన్నారు..