సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కంపగూడెం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై నుండి పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జగన్నాధపురం నుండి స్వగ్రామమైన వొడ్డు రామవరం గ్రామానికి వస్తుండగా ఈప్రమాదం అర్ధరాత్రి జరిగింది. రాత్రి సమయం కావడంతో ఎవరు గమనించకపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.