సిరా న్యూస్,గోపాలపురం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొవ్వాడ రిజర్వాయర్ నిండిపోయింది. దాంతో రెండు గేట్లు ఎత్తివేసారు. గోపాలపురం మండలం సాగిపాడు నుంచి దొండపూడి గ్రామాల మధ్య కొవ్వాడ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. కాలువ ఉధృతి వల్ల కొయ్యలగూడెం పోలవరం రూట్ లో రాకపోకలు నిలిచిపోయాయి.