సిరా న్యూస్,హైదరాబాద్;
తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి జూడాలు కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగారు. గత ఆరు నెలలుగా తమకు స్టైఫండ్ సరైన సమయానికి రావడం లేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్నా… ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
ఉస్మానియా హాస్పిటల్ లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని…
డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదని… ఇరుకు గదులలో తాము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని… తరుచు వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా నూతన భవనం తో పాటు , తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి , పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సమ్మెను ఉదృతం చేస్తామని జూడాలు హెచ్చరించారు.
======