సిరా న్యూస్,సిద్దిపేట;
జిల్లా కార్యాలయాల సముదాయంలోజిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగ్రవాల్ జాతీయ పతాకావిష్కరణ గావించారు..అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆనాడు బ్రిటిషర్ల నుండి స్వాతంత్రాన్ని పొందడానికి ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని ఆత్యాగదనులందరినీ గుర్తు చేసుకుంటు వారి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి అందరు కృషిచేయాలని అన్నారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.