సిరా న్యూస్,అన్నమయ్య;
వాల్మీకిపురం పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న పునుగుపల్లి వద్ద గుర్తుతెలియనీ యువకుడు రైలు కిందపడి బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. రైలు కిందపడి చనిపోయిన యువకుడు ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. తల చిద్రమైన కారణంగా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. కదిరి రైల్వే పోలీసులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. చనిపోయిన యువకుడు ఎవరన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది