సిరా న్యూస్, భీమదేవరపల్లి:
ముల్కనూర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
+ ఘన స్వాగతం పలికిన స్థానికులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. మండలంలోని ముల్కనూర్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోగా కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి విచ్చేసిన బండి సంజయ్ ను వేదమంత్రోచ్చారణలు, మేళ తాళాలతో ఆలయంలోకి తోడ్కొని వెళుతున్న ఆలయ అధికారులు, పూజారులు. వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు రామ్ గోపాల్ రెడ్డి, జన్మపురెడ్డి సురేందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు పైడిపల్లి పృథ్వి రాజ్, నాయకులు పాల్గొన్నారు.
వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్ కోడే మొక్కు చెల్లించుకున్నారు. స్వామీ వారికి ప్రత్యేక పూజలు చేశారు. బిజెపి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.