సిరా న్యూస్,మేడ్చల్;
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి కరీంనగర్ కు బయలుదేరి వెళుతున్న బండి సంజయ్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి వద్ద భాజపా మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాలువాలు, పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న హోటల్ లో అల్పాహారం తీసుకుని కరీంనగర్ బయల్దేరి వెళ్లారు.