సిరాన్యూస్, ఓదెల
అనారోగ్యంతో గోపాలమిత్ర ఉన్ని తిరుపతి మృతి
పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో 20 సంవత్సరాలుగా మూగజీవులకు సేవలు అందిస్తు గోపాలమిత్ర లో పనిచేస్తున్న ఉన్ని తిరుపతి అనారోగ్యంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఉన్ని తిరుపతి గోపాల మిత్ర లో ఔట్సోర్సింగ్ ద్వారా మూగజీవులకు సేవలందిస్తున్నాడు. గత కొద్దిరోజుల నుండి తిరుపతి ఆరోగ్యం బాగాలేక మంగళవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కూతురు అర్చన, కొడుకు సాయి ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయాడని కన్నీరుమున్నీరు గా వినిపిస్తున్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నారు. గోపాలమిత్ర సిబ్బంది తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. గోపతి ప్రవీణ్, సదయ్య,సమ్మన్న, శ్రీపతి మహేష్, ఫక్రుద్దీన్ మల్లేష్, శ్రీనివాస్, కలవల శ్రీనివాస్, సూపర్వైజర్ రాఘవ ఓదేలు తదితరులు ఉన్నారు.