పోలీసుల అదుపులో నిందితుడు
సిరా న్యూస్,జమ్మికుంట;
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జయంత్ ఇన్ఫ్రా కంపెనీ సంబంధించిన కాపర్ వైర్ గత రెండు రోజుల క్రితం చోరీకి గురికాగా సుమారు.4. లక్షల.50 వేల విలువగల కాపర్ వైర్లు దొంగిలించారు. గురువారం రాత్రి వీళ్ళు మళ్లీ చోరీకి యత్నించగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు తారాసపడ్డ వీరిపై అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం వీరిని విచారించగా గత రెండు రోజుల క్రితం మేమే ఈదొంగతనానికి పాల్పడ్డామని ఈ చోరీకి హైదరాబాదు నుండి కొంత మంది మహిళలను డైలీ కూలీగా తీసుకువచ్చి ఈ కాపర్ వైర్లు దొంగిలించామని పోలీసుల విచారణలో తెలిపారు, దొంగిలించిన వ్యక్తి. బాండవత్ సందీప్.ఎల్బీనగర్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పరారీలో ఉన్న రెండవ వ్యక్తి పేరు బాలు. ఇతనిది స్వగ్రామం దేవరకొండ వాసిగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసిన వ్యక్తి. హేమ కనకయ్య, ఇతనిది గజ్వేల్ స్వగ్రామం కాగా ప్రస్తుతం కీసర నాగారంలో నివసిస్తున్నాడు, జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి, మాట్లాడుతూ వీరు ఎత్తుకెళ్లిన కాపర్ వైర్ రైల్వే డిపార్ట్మెంట్ కాంటాక్ట్స్ సొమ్ముగా గుర్తించామని తెలిపారు, చోరీకి సహకరించిన మహిళలను పరారీలో ఉన్న అతనిని కూడా త్వరలో పట్టుకుంటామని వారు తెలిపారు. ఈ దొంగతనం కేసును 48 గంటల్లో చేదించిన పట్టణ సీఐ వరగంటి రవి, ఎస్సై ఆరోగ్యం, ఐడి పార్టీ పోలీసులను హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి, అభినందించారు..