రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్ మంత్రి ఆకస్మిక తనిఖీ
సిరా న్యూస్,హైదరాబాద్;
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం సచివాలయంలో అకస్మిక తనిఖీలు జరిపారు. ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని మంత్రి గుర్తించారు. ఉన్నతాధికారులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూశాఖ విభాగంలో 11.45 వరకు పూర్తిస్థాయిలో ఉద్యోగులు హాజరు కాలేదు. నిర్లక్ష్యంగా డ్యూటీకి వస్తున్న ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి హాజరు పట్టికలు పరిశీలించారు. పదిగంటల కల్లా ఉద్యోగులు విధులకు హాజరు కావాలని వార్నింగ్ ఇచ్చారు.