సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రలలో నిల్వ ఉన్న వడ్ల ను ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపదికన కొనుగోలు చేయాలనీ,పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, రానున్న రోజుల్లో మరిన్ని వర్షలు కురిసే అవకాశం ఉండటం వలన వడ్ల కొనుగోలు కేంద్రలలో ఉన్న వడ్ల ను వెంటనే కొనుగోలు చేయాలి,గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వలని,వడ్లకి ఇచ్చే ధరను గ్రేడ్ సిస్టమ్ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు….