సిరా న్యూస్;
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి సముద్రతీరంలో సముద్ర కెరటాలు అతివేగంగా ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్ అంతా ఈదురుగాలి వరసపు జల్లులతో ప్రమాదకరంగా మారింది. కాకినాడ ఉప్పాడ రోడ్డు కూడా రాకపోకలకు బంధు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు నేడు రేపు స్కూలుకు సెలవు దినం ప్రకటించడంతో అధికారులు పాఠశాలల్లో ప్రజలకు వసతులను ఏర్పాటు చేశారు. తుఫాను బారిన ఎవరూ పడకుండా ముందుగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామ గ్రామం అధికారులు జాగ్రత్తలను తెలియజేశారు. ఎప్పటికప్పుడు సమాచారాలను తెలుసుకుంటూ వసతి గృహాల్లోనే అధికారులు ఉన్నారు. ప్రజలు బయటికి రావాలంటే తుఫాన్ తీవ్రతకు భయభ్రాంతులవుతున్నారు.