Utnoor: ఉట్నూర్‌లో వికాసం పాఠశాలలో కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

సిరాన్యూస్‌,ఉట్నూర్
ఉట్నూర్‌లో వికాసం పాఠశాలలో కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూకల్వకుంట్ల తారకరామారావు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ప్రజా సేవలో ఇంకా ముందు ఉండి ప్రజలకు అన్ని విధాల సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలోబీ అర్ ఏస్ పార్టీ ఉట్నూర్ సోషల్ మీడియా నాయకుడు బాబా శ్యామ్ టైగర్ ,దుట మహేందర్ ,గిరి, సాజిద్, సదాని సురేష్ ,బాలాజీ, భూమన్న ,దినేష్ ,కేశవ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *