సిరా న్యూస్,విశాఖపట్నం;
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విశాఖ వై. సి. పి మూడు జిల్లాల ఇంచార్జ్ వై. వి. సుబ్బారెడ్డి, భారత క్రికెటర్ అంబటిరాయుడు ప్రారంభించారు.. ఈ సందర్భంగా వై. వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు వారి విధ్యాబ్యాసంతో పాటు, విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతు న్నామని అన్నారు.. దానితోపాటు క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తే.. విద్యార్థులు క్రీడల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు వొస్తాయని అన్నారు.. ఆడుదాం ఆంధ్రాలో అనేక క్రీడలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొందుపరిచారని, రాష్ట్రం మొత్తం అందరు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గునంటున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాధ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు, వై. సి. పి. నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు అనంతరం భారీగా బైక్ ర్యాలీ తో విశాఖకు పయనమయ్యారు.