సిరా న్యూస్,కోనసీమ;
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ముక్కోటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏడువారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం గా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఉత్తర దార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముక్కోటి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యంకలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు చెప్పారు.