సిరాన్యూస్, ఓదెల
ప్రజల ఆశీస్సులు ఉంటే గెలుస్తా: గడ్డం వంశీకృష్ణ
భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం
ప్రజల ఆశీస్సులు ఉంటే గెలుస్తానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో గురువారం భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుఆరోగ్యాలతో , సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్టే తెలిపారు. కాక ఆశీస్సులతో పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి సేవ చేయాలని దుపదంతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల దీవెనలతో కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వచ్చానని, ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ , నాయకులు కోట సత్యనారాయణ రెడ్డి , చెప్పరి రాజయ్య , మహేందర్ రెడ్డి , జాగిరి కిషోర్ , కందుల సదాశివ్ , రమేష్ , కత్తెర రామకృష్ణ ,చప్పరి కుమార్ ,మచ్చ నర్సింగం , జగిరి అంజి , కొడం శ్రీను తాల్ల పల్లి శ్రీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.