వంజరి కుల విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో రాణించాలి

తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం డైరెక్టర్ బొమ్మెల శంకర్
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వంజరి కుల విద్యార్థినిలకు నగదు ప్రోత్సాహకాలు అందజేత
సిరా న్యూస్,కోరుట్ల;
వంజరి కుల విద్యార్థులు సమాజంలో విద్యకు ప్రముఖ్యతను గుర్తించి ఉన్నత చదువుల్లో ఉత్తమ ప్రతిభతో రాణించాలని తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం డైరెక్టర్ బొమ్మెల శంకర్ అన్నారు.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం పదవ తరగతి మొదలుకొని ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జి పి ఏ, స్టేట్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ వంజరి కుల విద్యార్థినిలకు ఒక్కొక్కరికి నగదు రూ.లు 10,000 ప్రోత్సాహకాలు అందజేస్తుండగా గత విద్యాసంవత్సరం 2023 – 2024 కు గాను జగిత్యాల జిల్లాలో జీపిఏ, స్టేట్ ర్యాంకులు సాధించిన వంజరి విద్యార్థినిలకు రాష్ట్ర సంఘం ద్వారా మంజూరైన నగదు ప్రోత్సాహకాలను జిల్లా నుండి ఎంపికైన 14మంది కుల విద్యార్థినిలకు అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో రాష్ట్ర వంజరి సంఘం డైరెక్టర్, జగిత్యాల జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బొమ్మెల శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డైరెక్టర్ లు ఆరె శంకర్, ముస్కరి తుకారాం లు ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా బొమ్మెల శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉన్నత చదువుల్లో రానించిన వంజరి భావితరాల విద్యార్థులకు తన చేతులమీదుగా ఈ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. సామజిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న వంజరి కుసుమాలు పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో, సాధారణ విద్యాసంస్థలలో చదివినా కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులకు దీటుగా చదువుల్లో రానిస్తూ ఉత్తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. అయితే పాలకులు,ప్రభుత్వాలు గుర్తించి చేయూతనిస్తే వంజరి కుల విద్యార్థులు మరింత మెరుగ్గా చదివి సమాజానికి ఉపయోగపడుతూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.వంజరి విద్యార్థులు ఇదే స్పూర్తితో మరిన్ని పోటీ పరీక్షల్లో నెగ్గి జీవితంలో డాక్టర్లుగా, ఇంజనీర్, శాస్త్రావేత్తలుగా దేశానికి సేవచేయాలనీ బొమ్మెల శంకర్ ఆకాంక్షించారు.అనంతరం నగదు పురస్కారాలను అందుకొన్న 14 మంది విద్యార్థినిలను నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా నగదు ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు తెలంగాణ వంజరి సంఘం అధ్యక్షులు కాలేరు నరేందర్, ప్రధాన కార్యదర్శి కంధారి వెంకటేశం, కోశాధికారి కాలేరు అమరేందర్ మరియు రాష్ట్ర, జిల్లా సంఘాల కార్యవర్గమునకు ధన్యవాదములు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం డైరెక్టర్ లు ఆరె శంకర్, ముస్కరి తుకారాం, జిల్లా నాయకులు నవాతు రాజేందర్, లవంగ సాగర్, నల్లా వెంకటేశ్వర్లు వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *