Vasudha Foundation: కిడ్నీ బాధితునికి చేయూతనందించిన వసుధ ఫౌండేషన్

సిరా న్యూస్, జైనథ్:

కిడ్నీ బాధితునికి చేయూతనందించిన వసుధ ఫౌండేషన్

అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగుర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుజీ గూడ గ్రామానికి చెందిన సోయం అనుసరావ్ కు వసుత ఫౌండేషన్ అధ్యక్షులు మంతెన వెంకటరాజు రూ. 10 వేల ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించారు. అనుసరావ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపతున్నారు. గ్రామతులు ఈ విషయాన్ని వసుధ ఫౌండేషన్ ప్రతినిధులకు తెలపగా, ఫౌండేషన్ అధ్యక్షులు మంతెన వెంకట రాజు స్పందించి ఆర్థిక సాయం కోసం రూ. 10 వేల చెక్కు మంజూరు చేశారు. కాగా శుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధులు, బాధితునికి చెక్కు అందజేశారు. దీంతో అన్సరావ్ కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *