సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్:
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ఆధ్వర్యంలో పలువురు చేరారు. ఈసందర్బంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు, మాజీ సర్పంచ్ బక్క శెట్టి లక్ష్మణ్, మాజీ బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బక్క శెట్టి కిషోర్, మున్నూరు కాపు సంఘం నాయకులు ఇస్తరి రాములు, పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు పాలన చేసిన ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాలుగు నెలల్లోనే ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీలలో మూడు గ్యారంటీలను అమలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నారపు శంకర్ , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , మండల అధ్యక్షులు దోనికెనీ దయానంద్, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, నాయకులు తోట సత్యం, బి రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.