సిరాన్యూస్, ఖానాపూర్
సీడీఎంఏను కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్
* ఖానాపూర్ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం వినతి
హైదరాబాద్‌లో మున్సిపాలిటీ సిడిఎంఏ పి. గౌతం, మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారిని శనివారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా వారిని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లు వినతి పత్రం అందజేశారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , తదితరులు పాల్గొన్నారు.