+ ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సభలతో బూస్ట్…
+ జోష్‌లో కార్యకర్తలు… జోరుగా ప్రచారం…
+ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న బోజ్జు…
సిరా న్యూస్, ఖానాపూర్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గ కాంగ్రేస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్ షోలు, ఇంటింట ప్రచారంతో పల్లె పల్లెను చుడుతూ.. కాంగ్రేస్ 6 గ్యారంటీలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టి అధికారంలోకి రావడం ఖాయమని, ఖానాపూర్‌లో సైతం కాంగ్రేస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దళిత, గిరిజన దండోరాతో మొదలైన ప్రస్థానం..
ఒక సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన వెడ్మా బొజ్జ ఇంద్రవెళ్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రేస్ పార్టిలో చేరారు. అప్పటి నుంచి పార్టిలో చురుకుగా పనిచేస్తున్న ఆయనకు ఈ సారి పార్టీ టికెట్ ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి, అనతి కాలంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అందుకోవడం ఆయన వ్యక్తిత్వానికి, నిజాయితీగా లభించిన బహుమతిగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు.
కలిసివస్తున్న క్లీన్ ఇమేజ్…
వెడ్మా బొజ్జుకు ఉన్న క్లీన్ ఇమేజ్ అతనికి ఈ ఎన్నికల్లో కలిసి రానున్నట్లు నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఒక సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమై పనిచేస్తుండటంతో ఈ సారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. కాంగ్రేస్‌ను ఏళ్లుగా అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తలందరినికి కలుపుకొని ప్రచారంలో ముందుకు వెళ్తుండటమే కాకుండా, అధికంగా ఉన్న గిరిజన ఓట్లను తనవైపు తిప్పుకునేలా ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లో తీసుకెళ్లి, వాటిని వివరిస్తూ ముందుకు పోతున్న ఆయన తీరు ఇతర పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నదనే చెప్పవచ్చు.
కీలకంగా వ్యవహరిస్తున్న న్యాయవాది ప్రశాంత్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి…
కాంగ్రేస్ పార్టి అభ్యర్థి వెడ్మా బొజ్జుతో అత్యంత సన్నిహత సంబంధాలు ఉన్న, పెంబి మండలానికి చెందిన యువ న్యాయవాది సల్లా ప్రశాంత్ రెడ్డి ఈ ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల పాటు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రేస్ పార్టిలోనే కొనసాగుతూ… ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన బీఆర్‌ఎస్ గాలిలో ఎందరో మంది లీడర్లు గులాబి కండువాలు కప్పుకొని, బీఆర్‌ఎస్‌లోకి చేరారు. కానీ న్యాయవాది ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు స్వప్నిల్ రెడ్డి (కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు) మాత్రం నముకున్న సిద్దాతాలకు కట్టుబడి, కాంగ్రేస్‌లోనే కొనసాగుతున్నారు. అటు న్యాయవాది వృత్తిలో రాణిస్తూనే, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడే ప్రశాంత్ రెడ్డి, ఇటీవల జరిగిన ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సభలకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పెంబి మండలంలో మంచి వక్తగా, వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ రెడ్డి, ప్రసుత్త ఎన్నికల్లో వెడ్మా బొజ్జు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. కడెం మాజీ ఎంపీపీ అలెగ్జాండర్, ఖానాపూర్ పార్టి మండల అధ్యక్షుడు దయానంద్, కాంగ్రేస్ సీనియర్ నేతలు రాజుర సత్యం, దేవేందర్ రెడ్డి, సాగే అశోక్ రావ్, తులాల శంకర్, గుగ్గిల భూమేష్, తోకల మహేందర్, మెల్లెపల్లి స్వామి, భుక్యా సుభాష్, జగన్ రావు, అంగోత్ రాజేందర్‌ల అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుండటంతో ఖానాపూర్‌లో కాంగ్రేస్ జెండా ఎగరడం ఖాయమేననీ అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.