Vedma Bojju Patel: ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

సిరా న్యూస్, ఖానాపూర్
ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతినగర్ కాలనీకి చెందిన కోమిరే రాజు నడిపి రాజన్న దంపతుల కుమారుడు వరుణ్ సందేశ్ (సన్నీ) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ తర్లపడ్ రోడ్ పక్కన మామిడి తోటలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లారు. వైద్య ఖర్చుల కోసం రూ.10,000లు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నాకు మొన్న వారి కుటుంబ పరిస్థితి గురించి చెప్పారని,చాలా బీద కుటుంబానికి చెందినవారు, తినడానికి తిండి ఇల్లు లేక ఒక్క మామిడి తోటలో నివాసం ఉంటున్నార‌ని తెలిపారు.తండ్రి సుంకారి పనిచేస్తూ జీవనం గడుపుతున్నారని, వారికి సహాయం అందజేయామని కోరార‌ని తెలిపారు. వారి వద్దకు వెళ్లి ఆ బాబుకు కావలసిన వైద్య ఖర్చులు, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సదుపాయాలు కలిపిస్తామ‌న్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు దోనికెని దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , కౌన్సిలర్ నాయకులు జన్నారపు శంకర్ , మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్ , నాయకులు శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *