సిరాన్యూస్, ఖానాపూర్
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…
* కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావ్‌లతో తెలంగాణ ఆగం
* కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సోమర్ పెట్ గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు రూపాయి 500లకె గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. సరస్వతి కెనాల్ ద్వారా రైతులకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద చూపి అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. త్వరలో గ్రామ గ్రామాన తిరిగి సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం బీఆర్ఎస్, బిజెపి నాయకులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు.అనంతరం కార్యకర్తలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను శాలువాతో సత్కరించారు.
అగ్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…
ఖానాపూర్ మండలంలోని తార్లపాడు గ్రామంలో అగ్గిమల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.
పాఠశాల వార్షికోత్సవం…
ఖానాపూర్ మండలం మస్కపూర్ గ్రామంలో గల పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఉన్నతంగా చదవాలన్నారు. మహిళా సాధికారత కోసం నీస్సి స్కూల్ యాజమాన్యం కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో మండల అధ్యక్షులు దొనికేనీ దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మునిసిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల జనరల్ సెక్రెటరీ షాబీర్ పాషా, ఎంపిటిసి జంగిలి శంకర్,కార్యక్రమలో గ్రామ అధ్యక్షులు బిక్కు నాయక్, కొదరి నరేష్, మాజీ సర్పంచ్ చిన్న రాజన్న, కాన్సిరమ్ నాయక్, అంబజి, మాజీ సర్పంచ్ సుతారి రాజేశ్వర్, మాజీ ఎంపిటిసి వెంకటేష్, బాలంబిమ్మన, తదితరులు,నాయకులు కార్యకర్తలు,పాల్గొన్నారు.