సిరాన్యూస్, ఉట్నూర్
జగ్జీవన్ రాం చేసిన కృషి మరువలేనిది: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డా.బాబు జగ్జీవన్ రాం చేసిన కృషి మరువలేనిదని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. తాడిత, పీడిత, నిమ్న జాతి వర్గాల కోసం అయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.