Vedma Bojju Patel:అంద‌రికీ అన్ని విధాల అండగా ఉంటా

సిరాన్యూస్, దస్తురాబాద్‌
అంద‌రికీ అన్ని విధాల అండగా ఉంటా
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్‌
* అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన
అంద‌రికీ అన్ని విధాల అండగా ఉంటాన‌ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్ అన్నారు. బుధ‌వారం ఖానాపూర్ ఎమ్మెల్యే దస్తురాబాద్‌లో పర్యటించారు . ఈసంద‌ర్భంగా దస్తూరాబాద్ కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా మంజూరైనటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను తహసిల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దుర్గo మల్లేష్, యువజన నాయకుడు గుండ నరేష్,దస్తూరాబాద్ తహసీల్దార్ సర్ఫాజ్ నావాజ్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *