సిరాన్యూస్, ఖానాపూర్
నీటిని విడుదల చేయాలి : ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్
సరస్వతి కెనాల్ ద్వారా సాగు నీరు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ సరస్వతి కెనాల్ 27.28. డిస్టిబూటర్ సదర్ మార్ట్ కెనాల్ ద్వారా నీరు అందడం లేదని మంగళవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ స్వయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నీటిమట్టాన్ని పరిశీలించారు.ఈసందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ రైతాంగానికి పంట పొలాలకు నీరు అందేలా ఫోన్లో అధికారులతో మాట్లాడారు. నీటిని విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ ,డీసీసీ ప్రెసిడెంట్ శ్రీ హరి రావు, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు జన్నారపు శంకర్, తోట సత్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు